బాబు గ్రామదర్శినిలతో డబ్బు వృధా

విజయనగరం,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): చంద్రబాబు నిర్వహిస్తున్న గ్రామదర్శిని విూటింగుల వల్ల ప్రజలకు ఒరిగింది ఏమిలేదని రాష్ట్ర వై. సి.పి ప్రధాన కార్యదర్శి, పాయకరావుపేట నియోజకవర్గ కన్వీనర్‌ గొల్ల బాబురావు అన్నారు.పాయకరావుపేటలో జరిగిన విూడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామ దర్శిని,ధర్మపోరాట దీక్షలు పేరుతో ప్రజల సొమ్మును ఖర్చు చేస్తూ ఆ పార్టీ నాయకులకు కమిషన్లు అందజేస్తున్నారని అన్నారు.చంద్రబాబు మాటలు ఈ రాష్ట్రంలో ఎవరు నమ్మరని అన్నారు.ఈ సమావేశంలో వై. సి.పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొల్ల బాబురావు, జెడ్‌.పి.టి.సి సభ్యులు,జిల్లా సీనియర్‌ నాయకులు చిక్కాల రామారావు,టౌన్‌ అధ్యక్షులు దగ్గుపల్లి సాయి,దనిశెట్టి బాబురావు,ఎస్‌.సి సెల్‌ నాయకులు నెలపర్తి అర్జున్‌,లంకా సూరిబాబు, ఆడారి ప్రసాద్‌,ఎం.పి.పి అల్లాడ శివ తదితరులు పాల్గొన్నారు.

 

తాజావార్తలు