బాలికలకు రక్త పరీక్ష, గర్భిణీ స్త్రీలకు సీమంతాలు
బాలికలకు రక్త పరీక్ష, గర్భిణీ స్త్రీలకు సీమంతాలు* టేకులపల్లి ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో
టేకులపల్లి, మార్చి 28 (జనం సాక్షి): టేకులపల్లి మండలంలోని సులానగర్ పీహెచ్సీ సమావేశ మందిరంలో పోషణ పక్షంలో భాగంగా టేకులపల్లి ఐసిడిఎస్ ప్రాజెక్టు సిడిపిఓ ఆధ్వర్యంలో ప్రాజెక్టు లెవెల్ గా, రాష్ట్రస్థాయి పోషణ అభియాన్ టీం వారు సమక్షంలో కిశోర బాలికలకు రక్త పరీక్ష ,గర్భిణీ స్త్రీలకు సీమంతాలు మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రస్థాయి పోషణ అభియాన్ అధికారి రాహుల్ మాట్లాడుతూ పోషణ పక్షం ప్రోగ్రామ్స్ అంగన్వాడి కేంద్ర పరిధిలో నిర్వహించి వాటిని జనాందోలం డాష్ బోర్డులో అప్లోడ్ చేయటం జరుగుతుందన్నారు. అలాగే అంగన్వాడి కేంద్ర పరిధిలో నిర్వహించే కార్యక్రమాల ద్వారా అక్కడ ఉన్న గ్రామాల ప్రజలకు అవగాహన తెలిసే విధంగా వివరించడం జరుగుతుంది. జిల్లా సంక్షేమ అధికారి మాట్లాడుతూ పిల్లలలో రక్తహీనత శాతం తక్కువ, ఎక్కువగా ఉన్నవారికి అవగాహన కల్పిస్తూ సరైన ఆహారం తీసుకోవడం ద్వారా రక్తహీనత లోపించుకోకుండా జాగ్రత్తలు పడవచ్చన్నారు.ఈ కార్యక్రమానికి ముత్యాలంపాడు క్రాస్ రోడ్ సర్పంచ్ మాలోత్ సురేందర్ నాయక్, సులానగర్ సర్పంచ్ అజ్మీర బుజ్జి, బేతంపూడి సొసైటీ చైర్మన్ లక్కినేని సురేందర్, వైస్ ఎంపీపీ ఉండేటి ప్రసాద్, తుమ్మల చలక ఎంపీటీసీ రామకృష్ణ ,రాష్ట్రస్థాయి టీం రాహుల్ ,కల్పనా , రవికుమార్ ,జిల్లా స్థాయి అధికారి డి డబ్ల్యు ఓ లెనిన్,ప్రాజెక్ట్ ఆఫీసర్ మంగతారా, సులానగర్ పీహెచ్సీ డాక్టర్ దినేష్ , పి హెచ్ ఎన్ సీతమ్మ, హెల్త్ సూపర్వైజర్ విజయకుమార్, పాల్వంచ సిడిపిఓ కనకదుర్గ, ఏ ఎన్ ఎం ఎస్ సూపర్వైజర్లు అనురాధ,సక్కుబాయి, యశోద ,లక్ష్మి, అంగన్వాడీ టీచర్లు తల్లులు , సులానగర్ హై స్కూల్ పిల్లలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.