
బాల్కొండ: జూలై 30 (జనం సాక్షి) నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో సర్పంచి భూస సునీత,ఉపసర్పంచి షేక్ వాహబ్ వార్డు సభ్యులతో కలిసి ప్రతీ ఇంటికి 6 మొక్కలు పంపిణీ చేశారు.ఈసందర్భంగా పంచాయతీ కార్యదర్శి నల్లగంటి నర్సయ్య,వార్డు సభ్యులు పుప్పాల లావణ్య-విద్యా సాగర్,గాండ్ల రాజేష్,గాండ్ల రాజేందర్,బాద్గుణ రంజిత్ యాదవ్,పిళ్లేండ్ల శివ ప్రసాద్, రామన్ శివ,మారా ఝాన్సీ పురుషోత్తం,సయ్యద్ రియాజ్ అలీతో కలిసి వారు మాట్లాడారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా శనివారం మండల కేంద్రంలో ప్రతీ ఇంటికి 6 మొక్కలు పంపిణీ చేస్తున్నామని వారు తెలిపారు.భవిష్యత్తు తరాల కోసం ప్రతీ ఒక్కరూ మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని కోరారు
ఈకార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ ప్రభాకర్,మాజీ ఎంపీటీసీ సభ్యులు సెరియాల జగన్, తెరాస నాయకులు జెట్టి సాయన్న,సీనియర్ మెట్ సురేష్,CA లహరక పంచాయతీ కారోబర్ రాజు,విశాల్ గ్రామస్తులు, వన సేవకులు తదితరులు పాల్గొన్నారు.