బాసర సరస్వతి దేవి అమ్మవారిని దర్శించుకున్న గవర్నర్.
బాసర ట్రిపుల్ ఐటి ని సందర్శించిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్
నిర్మల్ బ్యూరో, ఆగస్టు07,జనంసాక్షి,,, ఆదివారం అర్జీయుకేటి బాసర ట్రిపుల్ ఐటి లో తెల్లవారుజామున తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ ను అదనపు కలెక్టర్ పి. రాంబాబు, ఉప కులపతి ప్రో,, వెంకటరమణ, సంచాలకులు ప్రో,, సతీష్ కుమార్, DSP జీవన్ రెడ్డి, ఆర్డీఓ లోకేష్ లు ప్రొఫెసర్ జయశంకర్ అతిధి గృహము నందు పుష్ప గుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం ఉదయం 7.00 గంటలకు బాసర అమ్మవారిని దర్శించుకున్నారు.
ఆలయ అర్చకులు గవర్నర్ ను పూర్ణ కుంభం తో స్వాగతం పలికారు. పూజ అనంతరం ట్రిపుల్ ఐటి భోజనశాలలో విద్యార్థులతో కలసి ముచ్చటిస్తూ అల్పాహారం స్వీకరించారు.
బాలికల, బాలూరు వసతి గృహాలను, భోజనశాల లను సందర్శించి, ప్రతీ గదిని పరిశీలించి విద్యార్థుల బాగోగులను అడిగి తెలుసుకున్నారు.
పరిపాలన భవనం ఎదురుగా మొక్కలు నాటి విద్యార్థులతో ఫోటోలు దిగారు.
ఆధ్యాపకులతో, విద్యార్థులతో విడివిడిగా సమావేశం నిర్వహించి ఉపకులపాతి నుద్దేశించి మాట్లాడుతూ ఒక మెడిసన్ వేసిన తర్వాత రోగం వెంటనే నయంకాదు. ఇప్పుడు సమర్ధవంతమైన ఉప కులపతి , సంచాలకులు ఉన్నారు. మెడిసన్ ఇప్పుడు పనిచేయడం ప్రారంభం అవుతుందని అన్నారు.
త్వరలో మంచి ఫలితాలు వస్తాయని ప్రశంసించారు.
విద్యార్థుల సమస్యలను తెలుసుకునేందుకు ఒక అమ్మా లాగా వచ్చానని, అన్నారు.
అనంతరం వైస్ ఛాన్సలర్ శాలువతో సన్మానించారు.
ఉన్నతధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.