బాసర IIIT లో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి.

– పి డి ఎస్ యు డిమాండ్

టేకులపల్లి, ఆగస్టు 24( జనం సాక్షి ): బాసర ట్రిపుల్ ఐటీ లో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని పి డి ఎస్ యు డిమాండ్ చేసింది .ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU) ఆధ్వర్యంలో టేకులపల్లి మండల కేంద్రంలో బుధవారం బాసర IIIT కళాశాలలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి కళాశాల నిర్వహణ వైఫల్యాలే కారణమని తెలియజేస్తూ ప్లేకాడ్స్ తో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పి డి ఎస్ యు జిల్లా కోశాధికారి జే గణేష్ మాట్లాడుతూ బాసర త్రిబుల్ ఐటీ లో సురేష్ అనే విద్యార్థి హాస్టల్లో ఉరి వేసుకుని ఆత్మహత్యయత్నం చేయగా, కోన ఊపిరితో ఉన్న సురేష్ ను అధికారులు నిర్మల్ ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయాడని అన్నారు. ఈ ఘటన పై ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ జరిపి విద్యార్థి కుటుంబాన్ని ఆదుకోవాలని,
అదే విధంగా బాసర త్రిబుల్ ఐటీ లో ఎన్నో ఆశలతో అడుగుపెట్టిన విద్యార్థుల ను సమస్యల వలయంలో నెట్టి వేయకుండా వెంటనే పరిష్కరించి సరియైన విద్యా ప్రమాణాలు పెంపొందించే దిశగా తగు చర్యలు ప్రభుత్వం తీసుకోవాలని డిమాండ్ చేశారు. సురేష్ బాసర త్రిపుల్ ఐటీ లో గత కొంతకాలంగా నెలకొన్న సమస్యల పట్ల,అక్కడ పరిస్థితులు,అధికారులు అవలంబిస్తున్న తీరు పట్ల తను మదన పడుతూ తోటి విద్యార్థుల తో అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉండేవాడని, పట్టించుకోకపోవడం వలన ఆత్మహత్యకు పూనుకున్నాడని, ఈ ఆత్మ హత్య ఘటన పై ప్రభుత్వం విచారణ జరిపాలని ప్రగతి శీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తున్నాట్లు తెలిపారు.