బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం


మెట్పల్లి పట్టణ కేంద్రంలోని వెంక రెడ్డి గార్డెన్ లో బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని బిఆర్ఎస్ కార్యకర్తలు,మహిళలు అధిక సంఖ్యలో హాజరైనారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లోని అన్ని నియోజకవర్గాల్లో కోరుట్ల నియోజకవర్గానికి అధిక పింఛన్లు అభివృద్ధి నిధులు కేటాయించడం, మంజూరు చేయించడం జరిగిందని అన్నారు. 77 వేల మందికి వివిధ రకాల వితంతు, చేనేత,గీత, బీడీ పింఛన్లు వస్తున్నాయని, అలాగే 1193 రైతులకు రైతుబంధు పథక లబ్ధిదారులుగా ఉన్నారని, దాదాపు 25 మందికి పైగా రైతు బీమా ద్వారా లబ్ధి పొందారని, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంక్షేమ పథకాలు ఉన్నాయని దీనిని ప్రజలు గ్రహించి మరో మారు తన కుమారుడైన కల్వకుంట్ల సంజయ్ కుమార్ ను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. కల్వకుంట్ల సంజయ్ ఎమ్మెల్యే గా గెలిచిన కూడా నేను మీతోనే ఉంటానని, మీ మధ్యలో ఉంటానని, నియోజకవర్గం విడిచి ఎక్కడికి వెళ్ళనని, మీ సహకారంతో మీకు నా గుండెల్లో ప్రాణం ఉన్నంత వరకు మీకు సేవ చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో కల్వకుంట్ల సంజయ్ ,మున్సిపల్ చైర్మన్ రాణావేని సుజాత సత్యనారాయణ ,వైస్ చైర్మన్ బోయినపల్లి చంద్రశేఖర రావు, కౌన్సిలర్ లు, కోఆప్షన్ సభ్యులు బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు