బిఎడ్, డిఎడ్ అభ్యర్థులపై లాఠీచార్జి చేయడాన్ని ఖండిస్తున్నాం
USFI తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి మాదం తిరుపతి
హనుమకొండ (జనం సాక్షి)
ఈరోజు హనుమకొండ పట్టణ కేంద్రంలో ఉన్న మాడిశెట్టి భూమయ్య భవన్ హనుమకొండ జిల్లా ముఖ్య నాయకుల సమావేశం జిల్లా ఉపాధ్యక్షులు హరీష్ అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర కార్యదర్శి మాదం తిరుపతి హాజరైనారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ కెసిఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఉద్యోగాలు అడిగిన వారిపై లాఠీచార్జి చేయడం సిగ్గుచేటుగా భావించాలని అన్నారు. కెసిఆర్ కు చిత్తశుద్ధి ఉంటే ఖాళీగా ఉన్న 25వేల పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం పూర్తిగా భర్తీ చేయకుండా కేవలం 5,089 పోస్టులను మాత్రమే కేసీఆర్ ప్రకటించడం సిగ్గుచేటని అన్నారు. పూర్తి స్థాయి మెగా డీఎస్సీ నిర్వహించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వానికి నిరుద్యోగుల గోడు కనబడపోవడం బాధాకరమన్నారు. శాంతియుతంగా పాఠశాల విద్యాశాఖ కార్యాలయం ముందు ఆందోళన చేస్తున్న వారిపై పోలీసులు లాఠీఛార్జి చేయడం సరైంది కాదని వారు తెలిపారు. పోలీసులు అత్యుత్సాహంతో వ్యవహరించడం సరైంది కాదన్నారు. ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ పోలీసులు అనేక సందర్భాల్లో వ్యవహరించాలని వారు వారి యొక్క తీరు మార్చుకోవాలని అన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పూర్తిస్థాయి డీఎస్సీ నిర్వహించాలని డిమాండ్ చేశారు అభ్యర్థులు చేసే న్యాయమైన పోరాటానికి మద్దతుగా అనేక కార్యక్రమాలు చేపడతామని మరియు వారు చేసే కార్యక్రమంలో ప్రత్యక్ష భాగస్వాములు అవుతామని తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి రాజేష్ నాయక్ నాయకులు రాకేష్ యశ్వంత్ శ్రీనాథ్ శ్రీకాంత్ హరీష్ రాజేష్ కిరణ్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.