బిపామీ కంపెనీల ద్యారా నల్లధనాన్ని, తెల్లధనంగా మార్చాలన్న ప్రభాకర్‌

హైదరాబాద్‌: ఉత్తరాఖండ్‌లోని పవర్‌ ప్రాజెక్టులో షర్మిల, బ్రదర్‌ అనిల్‌కు వాటాలున్నాయని భాజపా నేత ఎస్‌వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ ఆరోపించారు. విదేశాల్లో బినామీ కంపెనీల ద్వారా నల్లధనాన్ని ,తెల్లధనంగా మార్చారని ప్రభాకర్‌ అరోపించారు. హైదరాబాదులో రుణాలు తీసుకుని ఉత్తరాంచల్‌లో కంపెనీ, ఢీల్లీలో కార్యాలయం పెట్టారని, వైఎస్‌ను అడ్డం పెట్టుకుని షర్మిల, బ్రదర్‌ అనిల్‌ అక్రమంగా రుణాలు పొందారని ఆయన పేర్కొన్నారు.