బిల్లుడు తండాలో కంటి వెలుగు శిబిరం ప్రారంభం
టేకులపల్లి, మార్చి 1( జనం సాక్షి ): మండలంలోని బిల్లుడు తండ గ్రామంలో రెండో విడత కంటి వెలుగు శిబిరాన్ని స్థానిక సర్పంచ్ అజ్మీర గల్క బుధవారం ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం కంటి వెలుగు పరీక్ష చేయించుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అందత్వ నిర్మూలన కోసం మారుమూల గ్రామాల్లో ఉచితంగా వైద్య శిబిరాల ద్వారా కంటి వైద్య పరీక్షలు నిర్వహించి అర్హులైన వారికి వైద్య చికిత్స, కళ్లద్దాలు, తదితర సామాగ్రిలు ఇవ్వడం చాలా సంతోషకరమని వారన్నారు. స్థానిక ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు కంటి వెలుగు కార్యక్రమాలపై గ్రామంలో ఇంటింటికి తిరిగి ప్రచారం చేసి ప్రజలను చైతన్యవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రమాదేవి , డీఈవో దివ్య, ఆప్తమాలిక్ ఆఫీసర్ దార సనత్ కుమార్, ఎం ఓ రూప తదితరులు పాల్గొన్నారు.