బీజేపి కార్యాలయంలో సావిత్రిబాయి పూలే వర్ధంతి
హుజూర్ నగర్ మార్చి 10 (జనంసాక్షి): హుజూర్ నగర్ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో బిజెపి పట్టణ అధ్యక్షులు ఇంటి రవి ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా నివాళులర్పించడం జరిగింది. శుక్రవారం పట్టణ అధ్యక్షులు ఇంటి రవి మాట్లాడుతూ ఆడపిల్ల చదువు కోసం నిరంతరం పాటుబడిన మహిళ చైతన్య మూర్తి సమాజంలో రుగ్మతలు రూపుమాపడానికి విశేష కృషి చేసిన సామాజిక ఉద్యమకారిణి అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి బాలాజీ నాయక్, ఉపాధ్యక్షుడు దేవి శెట్టి మురళి, పోతురాజు విజయ్, నాగేంద్ర చారి, గోపి, మట్టయ్య, శ్రీనివాసరావు, రామకృష్ణ , కృష్ణ తదితరులు పాల్గొన్నారు.