బీజేపీ,ఆర్ఎస్ఎస్ లబ్ది పొందుతున్నది.
.—దేశాన్ని పరిపాలిస్తున్న ఆర్ఎస్ఎస్ నాయకత్వంలో ఉన్న బిజెపి ప్రభుత్వం దేశంలో మత ఘర్షణలు పెంచి లబ్ధి పొంది.తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలని కుటిల ప్రయత్నాలు చేస్తుంది. మరోపక్క ప్రభుత్వరంగ పరిశ్రమలను ప్రైవేటీకరణ చేయడం,ప్రకృతి సంపదను బడా కాంట్రాక్టర్లకు దారా దత్తం చేయడం,విద్యా వైద్యాన్ని ప్రజలకు అందకుండా చేయడం చేస్తుంది. పెదలకిస్తున్న సంక్షేమ పథకాలకు కోతలు విధించడం చేస్తుంది.ఈ విషయాలన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలను చైతన్యం చేయడం కోసం సిపిఎం ఆధ్వర్యంలో మార్చి 23న ఆదిలాబాద్ జిల్లాలో జన చైతన్య యాత్రను ప్రారంభించడం జరుగుతుంది.
ఈ యాత్ర మార్చి 25 వ తేదీన మంచిర్యాల జిల్లాకు రావడం జరుగుతుంది.
ఈ యాత్రలో అన్ని వర్గాల ప్రజలు, ప్రజాస్వా మికవాదులు పాల్గొని జయప్రదం చేయాలని, మంచిర్యాల జిల్లాలో బిజెపి మతోన్మాద ప్రమాదాన్ని తిప్పి కొట్టాలని,సిపిఎం మంచిర్యాల జిల్లా కమిటీ పిలుపునిస్తోంది అదేవిధంగా మంచిర్యాల జిల్లాలో అనేక సమస్యలు రాజ్యమేలుతుంటే వాటిని పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి.
దీని ఫలితంగా మంచిర్యాల జిల్లా ప్రజానీకం అనేక ఇబ్బందులెదుర్కొంటున్నారు.ముఖ్యంగా ఈ జిల్లాలో సింగరేణి బొగ్గు బావులు, ఓపెన్ కాసులు ఉన్నాయి. సింగరేణి సంస్థను కేంద్ర ప్రభుత్వం ప్రవేటీకరణ చేయడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తోంది. సింగరేణి సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత, బిజెపి కుట్రలో తిప్పి కొట్టాల్సినటువంటి కర్తవ్యం మంచిర్యాల జిల్లా ప్రజానీకం పైన ఉన్నది.అందుగురించి జన చైతన్య యాత్ర సిపిఎం పార్టీ చేపట్టడం జరిగింది. ఈ యాత్రలో పెద్ద ఎత్తున పాల్గొనాలని మరోసారి జిల్లా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం.ఈ సమావేశంలో సంకే రవి సిపిఎం జిల్లా కార్యదర్శి,గుమాస ప్రకాష్, కనికరం అశోక్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, దుంపల రంజిత్,దూలం శ్రీనివాస్,గుమాస అశోక్, దాగం రాజారాం జిల్లా కమిటీ సభ్యులు,మరియు పార్టీ నాయకులు మిడివెళ్లి రాజు,రమణ, ఆరిగెల మహేష్,ప్రేమ్ కుమార్, తిరుపతి,శ్రీకాంత్,రాములు పాల్గొన్నారు……………..జనం సాక్షి