బీజేపీతోనే తెలంగాణ సాధ్యం
వచ్చే ఎన్నికల్లో బీజేపీ నుంచే పోటీ చేస్తా :నాగం
హైదరాబాద్,ఏప్రిల్ 25: తెలంగాణ కోసం ప్రజలు ఎన్ని పోరాటాలు చేసిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వంతో అది సాధ్యం కాదని కేవలం భారతీయ జనతా పార్టీతోనే తెలంగాణ సాధ్యమవుతుందని నాగర్ కర్నూలు ఎమ్మెల్యే నాగం జనార్దన్‌రెడ్డి తెలిపారు.ఢిల్లీలో గురువారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌తో నాగం భేటీ అయ్యారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఏ పార్టీలో చేరాలనే దానిపై ఇంకా సమయం ఉంది.తమ పార్టీ కార్యకర్తలతోనూ,తెలంగాణ అభిమానులతోనూ పూర్తి స్థాయిలో చర్చించాకే బీజేపీలో చేరే విషయం గురించి చెబుతానని వెల్లడించారు.
తెలంగాణ విషయంపై కేంద్రం వైఖరి చూస్తుంటే పార్లమెంటుపై నమ్మకం పోతుందని ఆయన అన్నారు.కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే తెలంగాణ సాధ్యమవుతుందని నాగం ఆశాభావం వ్యక్తం చేశాడు.తెలంగాణవాదులంతా జాతీయ పార్టీనే గెలిపించాలని,ఎన్డీయే ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో మద్దతు తెలపాలని కోరారు.ప్రజలంతా ఐక్యంగా పోరాడి తెలంగాణను సాధించుకోవాలని పిలుపునిచ్చారు.రాబోయే ఎన్నికల్లో జాతీయ పార్టీ తరపునే పోటీ చేస్తానని కూడా ఆయన అన్నారు.