బీసీ సంఘాల ఆత్మీయ సమ్మేళనంలో ఐక్య వేదిక నాయకులు

వనపర్తి:సెప్టెంబర్ 11(జనం సాక్షి)హైదరాబాదు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో బీసీ టైమ్స్ అధినేత సూర్యరావు ఏర్పాటుచేసిన బిసి సంఘాల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ఆదివారం వనపర్తి అఖిలపక్ష ఐక్యవేదిక నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ మాట్లాడుతూ ముందుగా బాన్సువాడ వసతి గృహంలో పాము కాటుకు చనిపోయిన విద్యార్థికి సంతాపం తెలియజేసి చనిపోయిన విద్యార్థి కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించి వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.రాష్ట్రంలో బీసీ వసతి గృహాలలో కనీస వసతులు కల్పించి విద్యార్థులు ఎలాంటి అపాయాల బారిన పడకుండా చర్యలు తీసుకోవాలని వారన్నారు లేనియెడల రాష్ట్రవ్యాప్తంగా కలిసివచ్చే అన్ని ప్రజా సంఘాలు కుల సంఘాలను కలుపుకొని ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.ఎస్సీ ఎస్టీ బీసీ కులాలలో జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయించి చట్టసభలలో అన్ని కులాలు ప్రాతినిధ్యం వహించే విధంగా చర్యలు తీసుకోవాలని అందులో మహిళలకు 50 శాతం సీట్లు కేటాయించాలని తెలియజేశారు. బిసి సంఘాల నాయకులు బీసీలు చైతన్యమై ఐక్యమత్యం కావాలని పిలుపునిచ్చారు .ఈ కార్యక్రమంలో కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు