బెంగాల్‌ను అఫ్గాన్‌గ ఆమార్చే కుట్ర
బిజెపి అధ్యక్షుడు సుకాంత మజుందర్
కోల్‌కతా,సెప్టెంబర్21 (జనంసాక్షి) : పశ్చిమ బెంగాల్ భారతీయ జనతా పార్టీ విభాగం అధ్యక్షుడిగా సుకాంత మజుందర్ బాధ్యతలు స్వీకరించిన అనంతరమే అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పశ్చిమ బెంగాల్ రాష్టాన్న్రి అఫ్ఘానిస్తాన్‌గా మారుస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే బీజేపీ ఉండగా అది జరగనివ్వమని ఆయన పేర్కొన్నారు. మంగళవారం రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పైవిధంగా మాట్లాడారు. టీఎంసీ పూర్తిగా కుటుంబ పార్టీ. మమతా బెనర్జీ కుటుంబ ప్రయోజనాల కోసమే టీఎంసీ పని చేస్తుంది. కానీ బీజేపీ అలా కాదు. సాధారణ ప్రజల కోసం, సాధారణ ప్రజల ప్రయోజనాల కోసం పని చేస్తుంది, సాధారణ ప్రజలకు బాధ్యత వహిస్తుంది. అయితే కొన్ని శక్తులు రాష్టాన్ని అఫ్ఘాన్‌లా మార్చే కుట్రలు చేస్తున్నాయి. అలాంటి వాటిని మేము సాగనివ్వం. బెంగాల్‌ను మరో అఫ్ఘాన్‌ల మారనివ్వం‘ అని సుకాంత మజుందర్ అన్నారు.