బేగంపేటలో బంగారు నగల చోరి
హైదరాబాద్, జనంసాక్షి: బేగంపేట రాయల్‌హోమ్‌లో మంగళవారం మధ్యాహ్నం భారీ చోరీ జరిగింది. రూ. 10లక్షల విలువైన బంగారం నగలును గుర్తు తెలియని దుండగులు అపహరించారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.