బైక్‌ను ఢీకొన్న లారీ: ఒకరు మృతి
వరంగల్,జూలై4(జనం సాక్షి ): జిల్లాలోని ఖిలావరంగల్ మండలం మామునూరు శివారులో రోడ్డు ప్రమాదం సంభవించింది. అదుపుతప్పిన లారీ బైక్‌ను ఢీకొన్న దుర్ఘటనలో వ్యక్తి మృతిచెందాడు. మృతుడిని కట్రియాల గ్రామానికి చెందిన తీగల ప్రభాకర్‌గా గుర్తించారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లుగా భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.