బోథ్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గోరింటాకు సంబురాలు

(జనంసాక్షి)             ఆషాఢ మాసిన్ని పురస్కరించుకొని బోథ్ ఆర్య వైశ్య సంఘం మహిళ విభాగం ఆధ్వర్యంలో సోమవారం గోరింటాకు ( మెహెందీ  సంబురాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో బోథ్  ఆర్యవైశ్య మహిళలు మాట్లాడుతూ ఆషాఢ మాసంలో మహిళలు చేతులకు మైదాకు పెట్టుకోవడం ఆనవాయితీ అని ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మైదాకు ఆషాఢ మాసంలో అమ్మవారు ఇచ్చే ప్రసాదంగా మైదాకు స్వీకరిస్తారని,
తల్లి తండ్రులు పిల్లలకు చిన్ననాటి నుండే సంస్కృతి సంప్రదాయాలు,
భక్తి శ్రద్ధలు పెద్దల పట్ల గౌరవం నేర్పించాలని ఆకాంక్షించారు.
బోథ్ ఆర్యవైశ్య సంఘం మహిళలు పాల్గొన్నారు