బోనమెత్తిన ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్

క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని బోక్కల గుట్ట శ్రీ శ్రీ శ్రీ గాంధారి మైసమ్మ తల్లి ఆషాడ మాసం బోనాల జాతర సందర్భంగా ఆదివారం చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా బోనంతో డప్పు చప్పుల్ల మధ్య నృత్యాలు చేసుకుంటూ ర్యాలీగా వచ్చి అమ్మవారికి బోనం సమర్పించి, మైసమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుతూ బోనం సమర్పించారు. అమ్మవారు ప్రజలందరినీ చల్లంగా చూడాలని కోరుకున్నారు. బంగారు తెలంగాణ నిర్మాణమే ధ్యేయంగా పని చేస్తున్నా మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఏసీపి ఎడ్ల మహేష్ క్యాతన్ పల్లి మున్సిపల్ చైర్మన్ జంగం కళ, పట్టణ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, కౌన్సిలర్ పారుపల్లి తిరుపతి,కౌన్సెలర్లు, సీనియర్ నాయకులు రామిడి కుమార్ , యువనాయకులు, మహిళా నాయకురాలు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.