బ్యాటింగ్‌ ప్రారంభించిన ఇంగ్లాండ్‌

Cricket - India v England - First Test cricket matchభారత్‌- ఇంగ్లాండ్‌ మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్‌లో భాగంగా రాజ్‌కోట్‌లో జరుగుతున్న మొదటి టెస్టు చివరి రోజున ఇంగ్లాండ్‌ బ్యాటింగ్‌ ప్రారంభించింది. నాల్గవ రోజైన శనివారం తన రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఇంగ్లాండ్‌ ఓపెనర్లు రాణించడంతో నిలకడగా ఆడుతోంది. కాగా క్రీజులో ఇంగ్లాండ్‌ ఓపెనర్‌లు హసీబ్‌ హమీద్‌ 70(145), అలిస్టర్‌ కుక్‌ 58(133) ఉండగా ఇంగ్లాండ్‌ వికెట్లేమి నష్టపోకుండా 134 పరుగులతో బ్యాటింగ్‌ కొనసాగిస్తోంది.