బ్రహ్మణి స్టీల్స్‌కు భూ కేటాయింపులు రద్దు చేసిన ప్రభుత్వం

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 25:కడప జిల్లాలోని బ్రహ్మణి స్టీల్స్‌కు సంబంధించిన భూ కేటాయింపులను రద్దు చేసిన బుధవారం ప్రభుత్వం ప్రకటించింది.బ్రహ్మణి స్టీల్స్‌కు కేటాయించిన 10వేల 766 ఎకరాలను రద్దు చేస్తున్న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి దీనికి సంబంధించిన ఫైలుపై సంతకం చేశాడు.

వైఎస్‌ఆర్‌ జిల్లాలోని జమ్మలమడుగు మండలం వేగుంటపల్లి,కొత్తగుంటపల్లి,పి.బొమ్మపల్లి,తూగుటపల్లి,ప్రాంతాలలో ఉన్న భూములను వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి బ్రాహ్మణి స్టీల్స్‌కు కేటాయించారు.ప్రభుత్వం భూ కేటాయింపులు రద్దు చేసి ఈ భూములను వెనక్కు తీసుకోవడానికి రంగం సిద్ధం చేసింది.