బ్రహ్మశ్రీ నారాయణదాసు లవ కుమారాచార్యులకు ఉగాది జాతీయ మహానంది పురస్కారం


గోపాల్ పేట్ జనం సాక్షి మార్చి (4): పొలికెపహాడ్ గ్రామం గోపాల్ పేట మండల పరిధిలోని పొలికెపహాడ్ గ్రామానికి చెందిన జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్య వేద విద్యాశ్రమమ్ (వేదపాఠశాల) వ్యవస్థాపకులు విద్యాసామ్రాట్ బిరుదాంకితులు బ్రహ్మశ్రీ నారాయణదాస్ లవకుమారాచార్యులుకు చిక్కడపల్లి లోని త్యాగరాయ గానసభ మీటింగ్ హాల్లో ఇటీవల ఆయనకు పట్టు శాలువా కప్పి జ్ఞాపికను అందజేసి మరియు గురు కిరీటాన్ని దరింపజేసి జాతీయ మహానంది పురస్కారం అందజేశారు తెలుగు వెలుగు సాహితీ సంస్థ వ్యవస్థాపకులు పోలోజు రాజ్ కుమార్, సరస్వతీ మాత ఉపన్యాసకులు డాక్టర్ దైవజ్ఞ శర్మ , గిన్నిస్ వరల్డ్ రికార్డ్ గ్రహీత వంగల శాంతి కృష్ణమాచార్యుల చేతుల మీదుగా పురస్కారం అందజేయడం జరిగింది. బ్రహ్మశ్రీ నారాయణదాసు లవకుమారాచార్యులు మాట్లాడుతూ ఈ అవార్డు రావడం చాలా ఆనందంగా ఉందని నా బాధ్యతలు మరింత పెరిగాయన్నారు గ్రామస్తులు, పలువురు ప్రముఖులు వారిని అభినందించారు