బ్రిటన్ కేబినెట్‌లో భారత సంతతి మహిళ ప్రీతి పటేల్ చోటు!
బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ నూతన కేబినెట్‌లో భారతీయ సంతతి మహిళ చోటు సంపాదించారు. ఇటీవలి ఎన్నికలలో రెండోసారి గెలిచిన ప్రీతి పటేల్‌ను ఉపాధి కల్పన శాఖ మంత్రిగా నియమిస్తున్నట్లు ప్రధానమంత్రి డేవిడ్ కామెరూన్ వెల్లడించారు.
కాగా, బ్రిటన్ పార్లమెంట్‌లోని మొత్తం 650 స్థానాలకు ఇటీవల ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. వీటిలో 316 స్థానాలను కామెరూన్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ గెలుచుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి.
ప్రధాన ప్రతిపక్షం లేబర్ పార్టీ కేవలం 239 స్థానాలకే పరిమితమవుతుందట. ఎగ్జిట్ పోల్స్ చెప్పిన విషయం అక్షర సత్యం కానుందని కామెరూన్ కేబినెట్‌లోని కీలక మంత్రి మైఖేల్ గోవ్ ధీమా వ్యక్తం చేశారు. కాగా, ఈ ఎన్నికల్లో స్కాట్లాండ్‌కు చెందిన 20 యేళ్ల విద్యార్థిని విజయం సాధించి సరికొత్త రికార్డును సృష్టించిన విషయం తెల్సిందే.