బ్రిడ్జ్ లేక వాగుదాటే కష్టాలు ప్రయాణికులకు తప్పడంలేదు.

జనంసాక్షి న్యూస్ నెరడిగొండ:
కుంటాల జలపాతాన్నీ వెళ్లే రహదారి రోడ్డుపై బ్రిడ్జి నిర్మాణానికి మా వంతు సంబంధిత ఎమ్మెల్యే మంత్రుల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకళ్లి ప్రయాణికుల ఇబ్బందులను తొలగించెదుకు ప్రయత్నం చేస్తామని మండల జడ్పీటీసీ అనిల్ జాధవ్ ఎంపీపీ రాథోడ్ సజన్ స్థానిక సర్పంచ్ జాధవ్ కల్యాణి మహేందర్ కు తెలిపారు.శనివారం రోజున కురిసిన భారీ వర్షానికి వాగు పొంగిపొర్లుతున్నా దృశ్యాన్ని మండల జడ్పీటీసీ ఎంపీపీ లైవ్ జిల్లా అధ్యక్షుడు మహేందర్ తోకలసి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పరిశీలించారు.మండల కేంద్రానికి దగ్గర సావుర్గాం గ్రామ సమీపంలో ఉన్న వాగుపై బ్రిడ్జి కట్టడం మర్చిపోయి సవంత్సరాలు గడుస్తున్నా పట్టించుకునే నాధుడే లేకపోతే..రాష్ట్రంలోనే ఎత్తైన కుంటాల జలపాతంను సందర్శించే పర్యాటక ప్రయాణికులకు మండలంలోని ఆయా గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పడంలేదు.ఇట్టి విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజా ప్రతినిధులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా ప్రభుత్వ ఉన్నతాధికారులు పట్టించుకోని బ్రిడ్జి నిర్మించి ప్రజ కష్టాలను తీర్చలని స్థానికులు కోరుతున్నారు.