భక్తిశ్రద్ధలతో వినాయక నవరాత్రులు నిర్వహించాలి
జనం సాక్షి / కొల్చారం ఆగస్టు 30 :
కొల్చారం మండల ఎస్ ఐ సారా శ్రీనివాస్ గౌడ్ వినాయక నవరాత్రులు పురస్కరించుకొని మాట్లాడుతూ ఆయన ఇలా అన్నారు భక్తిశ్రద్ధలతో వినాయక నవరాత్రులు నిర్వహించుకోవాలి ప్రతి మండపం వద్ద ఇద్దరు సభ్యులు ఉండాలి
వినాయక చవితిని పురస్కరించుకుని నవరాత్రులు భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని కొల్చారం ఎస్ఐ సారా శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మంగళవారం నాడు ఆయన విలేకరులతో మాట్లాడుతూ మండల పరిధిలోని ప్రతి గ్రామంలో ఏర్పాటు చేస్తున్న వినాయక మండపాల వద్ద ఎప్పటికీ ఇద్దరు సభ్యులు ఉండేలా చూసుకోవాలని ఈ నవరాత్రులు శాంతియుత వాతావరణంలో చేసుకోవాలని జిల్లా ఎస్పీ ఆదేశాల .మేరకు వినాయక మండపాల నిర్వహకులు నిబంధనలు తప్పకుండా పాటించాలని అన్నారు. ఊరేగింపు నిర్వహించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని డీజే కి అనుమతి లేదని ముఖ్యంగా యువకులు మద్యం జోలికి వెళ్లకుండా అన్ని పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు కుల మతాలకు అతీతంగా పోలీస్ శాఖకు అందరూ సహకరించాలని అన్నారు.




