భక్తులతో కిటకిటలాడుతున్న సప్తపురి శనిఘాట్
ఝరాసంగం ఆగస్టు 27 (జనంసాక్షి) జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని ఝరాసంగం లోని ఏడా కులపల్లి సప్తపూరి శని ఘాట్ వద్ద భక్తులు శని అమవాస్య కావడంతో భక్తులతో ఆలయం కిటకిటలాడుతు భక్తులు భారీగా తరలివచ్చారు.ఉదయం 5 గంటల నుంచి శనేశ్వరుని దర్శించుకోవడానికి లైన్లలో నిలుచుని మొక్కులు తీర్చుకున్నారు.ఆలయ కమిటీ అధ్యక్షులు, సభ్యులు భక్తులకు మంచినీటి సౌకర్యం అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.




