భక్తుల కొంగు బంగారం లంబోదరుడు – శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్”
శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 03( జనంసాక్షి): కోరుకున్న భక్తులకు కోరినన్ని వరాలను ప్రసాదిస్తూ ముక్కోటి దేవతలతో మొదటి పూజ అందుకునే ఆదిదేవుడు తన భక్తులపట్ల కొంగుబంగారంమని, భోళా శంకరుని ప్రియతమయుడు ఆ లంబోదరుడని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. వినాయక చవితి మహా పర్వదినాన్ని పురస్కరించుకొని డివిజన్ పరిధిలోని వివిధ గణేష్ మండపాల వద్దకు శనివారం వెళ్లి ఆయన ప్రత్యేక పూజాధి కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి ఆయన కృపకు పాత్రులు అయ్యారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ హిందువులు, ఇతర మతాలు అనే తారతమ్యం లేకుండా నేడు ఎంతోమంది గణేష్ నవరాత్రి కార్యక్రమాలను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ మతసామరస్యానికి నాంది పలుకుతున్నారని రాగం అన్నారు. ఏడేడు 14 లోకాలలో మొదటి పూజ అందుకునే ఆదిదేవుడుగా అద్భుత వరాన్ని అందుకున్న గణనాథుడు భక్తుల విషయంలో సైతం అంతే ప్రేమానురాగాలను పంచుతూ వారి కోరికలను తీర్చే లంబోదరుడుగా కొనియాడ బడుతున్నారని నాగేందర్ యాదవ్ స్పష్టంచేశారు. భక్తులంతా ఎంత భక్తిశ్రద్ధలతో నవరాత్రి కార్యక్రమాలను జరుపుకుంటే అంత మంచి జరుగుతుందని, ఎలాంటి ఆపదలైనా తొలగిపోయి వారు ఉన్నత స్థానానికి చేరుకునే మార్గం సుగమమవుతుందన్నారు. ఈ క్రమంలో ఆయా మండపాల వద్ద నిర్వహించిన అన్నదాన కార్యక్రమాలలో రాగం పాల్గొని భక్తులకు అన్నం వడ్డించారు. పవిఘ్నేశ్వర స్వామివారి కృపాకటాక్షాలు భక్తులందరిపై ఉండాలని ఆకాంక్షిస్తూ.. ప్రజలందరూ అష్ట ఐశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు దుర్గం వీరేశం గౌడ్, నరసింహ గౌడ్, రవి యాదవ్, ఆదిత్య కిరణ్, గోపాల్ యాదవ్, శిల్ప గార్డెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జీ.వీ.ఎస్ రామారావు, జనరల్ సెక్రెటరీ రామ్ కిషోర్ యాదవ్, సురేంద్ర, రాజశేఖర్, అశ్విన్, డి. కుమార్, వినాయక స్వామివారి పూజా కార్యక్రమానికి విచ్చేసిన భక్తులు తదితరులు పాల్గొన్నారు.