భజన మండలికి తబలాల బహుకరణ….

చిలప్ చేడ్/23ఆగస్టు/జనంసాక్షి :- మండలంలోని రాహీంగూడ గ్రామంలో శ్రావణమాస మంగళవారం సందర్బంగా హనుమాన్ మందిరానికి చంద్రంపెట్టి తీర్థప్రసాదాలు అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో కౌశిక్ కమ్యూనికేషన్స్ నిర్వాహకులు రామగౌని శ్రీకాంత్ గౌడ్,రమేష్ గౌడ్ పాల్గొని హనుమాన్ మందిర్ భజన మండలి భక్తులకు తబలాలు భజన సామగ్రిని అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఆంజనేయులు,జోగయ్య,శ్రీను,చిన్న ఆంజనేయులు, బాలయ్య,సురేష్,నరేష్,మల్లేష్,సత్యం,లక్ష్మయ్య,భూపాల్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు