భద్రాచలం ఆలయంలో ముత్యాల తలంబ్రాలు విక్రయం
ఖమ్మం, జనంసాక్షి: ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం రాములవారి ఆలయంలో ముత్యాల తలంబ్రాల విక్రయాన్ని అధికారులు చేపట్టారు. ఒక్క ముత్యం ఉన్న తలంబ్రాల ప్యాకెట్ ధర రూ. 5, రెండు ముత్యాలు ఉన్న తలంబ్రాల ప్యాకెట్ ధర రూ. 10గా నిర్ణయించారు. ఆలయ చరిత్రలోనే మొదటిసారిగా చేపట్టిన ఈ తలంబ్రాల విక్రయాన్ని భక్తులు వ్యతిరేకిస్తున్నారు. ముత్యాల తలంబ్రాలకు డిమాండ్ పెరగడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ ఈవో తెలిపారు.