భర్తను హత్య చేస్తే అది మర్డర్‌ కాదు

తమిళనాడు కేసులో సుప్రీం సంచలన వ్యాఖ్య

న్యూఢిల్లీ,జనవరి28(జ‌నంసాక్షి): భర్తను భార్య చంపితే అది మర్డర్‌ కాదు అని, కానీ ఆ ఘటనను ఓ నరహత్యగా భావించాలని ఓ తీర్పులో సుప్రీంకోర్టు వెల్లడించింది. తమిళనాడు కేసులో సుప్రీం ఈ తీర్పును ఇచ్చింది. కూతురు ముందే భార్యను ఆమె భర్త వ్యభిచారిణి అని నిందించినప్పుడు ఆ మహిళ తన భర్తను చంపేస్తే అప్పుడు అది హత్య కాదని సుప్రీంకోర్టు తెలిపింది. మన సమాజంలో ఏ మహిళ కూడా వ్యభిచారిణి అని అనిపించుకోవడానికి ఇష్టపడదు అని, ఆ మాట వినలేక మహిళ తన కోపాన్ని భర్తపై చూపించిందని కోర్టు తీర్పునిచ్చింది. వాస్తవానికి ఆ మహిళ మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నది. ఆ విషయం భర్తకు తెలిసింది. దీంతో ఇద్దరి మధ్య గొడవైంది. ఆ సమయంలో ఆ మహిళ లవర్‌ కూడా ఆ ఘర్షణలో పాల్గొన్నాడు. అక్కడే ఆమె కూతరు కూడా ఉన్నది. భర్త తీవ్ర స్థాయిలో తిట్టడంతో మనస్తాపానికి గురైన భార్య తన లవర్‌తో కలిసి భర్తను హత్య చేసింది. ఫ్రెండ్‌ కారులో భర్తను కాల్చేసిన ఆమె తన నేరాన్ని కోర్టు ముందుకు ఒప్పుకున్నది. ఈ కేసులో మద్రాసు కోర్టు ఆ మహిళకు, తన లవర్‌కు జైలు శిక్ష విధించింది. దీన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంను ఆశ్రయించారు. ఆ కేసును విచారించిన శంతన్‌గౌడర్‌, దినేశ్‌ మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం తీర్పునిచ్చింది. వ్యభిచారి అని పిలవడం వల్ల మహిళ సడెన్‌గా ఆవేశానికి లోనైందని, దాంతో ఆమె భర్తపై అటాక్‌ చేసిందని సుప్రీం వెల్లడించింది. ఆ మహిళపై నమోదు అయిన మర్డర్‌ కేసును కొట్టివేస్తూ దాన్ని కల్పబుల్‌ ¬మిసైడ్‌గా తీర్పును మార్చింది. జైలు శిక్షను కూడా పదేళ్లకు తగ్గించారు.