భాజపా ఆధ్వర్యంలో బంద్
ఖైంసా: దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన వరుస బాంబు పేలుళ్లకు నిరసనగా భాజపా ఆధ్వర్యంలో ఖైంసా పట్టణంలో బంద్ పాటించారు. ఈ సందర్భంగా వ్యాపారులు స్వచ్చందంగా మద్దతునిచ్చారు. ఆర్టీసీ బస్సులను నిలిపివేయాలని ఖైంసా డిపో ఎదుట భాజసా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. దీంతో ఆర్టీసీ అధికారులు బస్సులను నిలిపివేశారు.