భారతదేశ కీర్తిని ప్రతిబింబిస్తూ జాతీయ జెండాను సగర్వంగా ఎగురవేయాలి.

మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దీప నర్సింలు.
తాండూరు ఆగస్టు 14 (జనం సాక్షి)
స్వాతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఆదివారం తాండూరు పట్టణంలోని 9వ వార్డ్ సాయిపూర్ లో వైస్ చైర్ పర్సన్ దీప నర్సింలు స్వగృహం పై మువ్వన్నెల జాతీయ జెండా ఎగురవేశారు.ఈ సందర్భంగా వైస్
చైర్ పర్సన్ దీప నర్సింలు మాట్లాడుతూ స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలని సూచించారు. ఇంటింటా జాతీయ పథకాన్ని ఎగరవేసి స్వతంత్ర భారత కీర్తిని దశదిశలా చాటుదామని పిలుపునిచ్చారు,75వ భారత స్వతంత్ర వజ్రోత్సవవాలను ఘనంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.ఇంటింట జెండా పండుగ జరగాలని సీఎం కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి ఇంటిపై జెండాలను ఎగరవేసి జెండా పండుగను ఘనంగా నిర్వహించాలన్నారు.
ఈ సందర్భంగా తాండూరు నియోజకవర్గ ప్రజలందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.75 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలని ప్రతి ఒక్కరూ దేశభక్తి చాటుకోవాలని ఆమె పేర్కొన్నారు