భారత్‌ పర్యటనకు రాజపక్సె

కొలంబో,ఫిబ్రవరి8(జ‌నంసాక్షి): శ్రీలంక ప్రతిపక్ష నేత మహింద్ర రాజపక్సే భారత్‌ను సందర్శించనున్నారని ఆయన కార్యాలయం తెలిపింది. గత నెలలో ప్రతిపక్ష నేతగా నియామకం అయిన తర్వాత ఇదే ఆయన మొట్టమొదటి విదేశీ పర్యటన కానుంది. శ్రీలంక నుండి శుక్రవారం బయలుదేర నున్నట్లు కార్యాలయం తెలిపింది. భారత్‌-శ్రీలంకల మధ్య సత్సంబంధాలపై బెంగళూరులో ఆయన ప్రసంగించనున్నారని పేర్కొంది. గత ఏడాది అక్టోబర్‌లో ప్రధానిగా రణిలే విక్రమ సింఘేను తొలగించి రాజపక్సేను శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన నియమించడంతో అక్కడ రాజకీయ సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పుతో తిరిగి ప్రధానిగా రణిలే ఎంపికయ్యారు.