భారత దేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు
సావిత్రి భాయి పూలే ను నేటి మహిళలు ఆదర్శంగా తీసుకోవాలి…
సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు..
రావుల రాజు.బిసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు
భువనగిరి టౌన్ (జనం సాక్షి):–
ప్రముఖ సంఘ సంస్కర్త, నిమ్న వర్గాల అభ్యున్నతి కోసం అలుపెరగని పోరాటం చేసి, మహిళా విద్యాభివృద్ధికి ఎనలేని కృషి చేసిన సామాజిక కార్యకర్త, రచయిత్రి సావిత్రి బాయి పూలే గారి వర్ధంతి సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో స్థానిక Sv హోటల్ లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వారి ఫోటో కు పులా మాల వేసి ఘననివాళి అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు రావుల రాజు మాట్లాడుతూ మహిళ చదువు కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన ఘనత సావిత్రి భాయి పూలే కే దక్కుతుందని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే సావిత్రి భాయి పూలే, జ్యోతిరావు పూలే దంపతులకు భారత రత్న అవార్డు తో గౌరవించాలని ఆయన డిమాండ్ చేశారు. నేటి మహిళలకు సావిత్రి భాయి పూలే జీవితాన్ని, త్యాగాన్ని అధ్యయనం చేయాలని కోరారు. ప్రతి మహిళ చదువుకొని,తన స్వంత కాళ్ళ మీద తాను నిలబడే విధంగా కృషి చేయాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో దళిత ఐక్య వేదిక జిల్లా అధ్యక్షులు బట్టు రామచంద్రయ్య, సామాజిక ఉద్యమ నాయకులు కొడారి వెంకటేష్, సేవాదళ్ పిట్టల బాలరాజ్ ,ఇటుకల దేవేందర్, ,సురుపంగ శివలింగం, వడ్డేపల్లి దాస్,పాండరి తదితరులు పాల్గొన్నారు.