భారివర్షాలకు నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారం అందజేయాలి..

 తిరుపల్లి ,బ్యూరో, జూలై16,,జనంసాక్షి,,,, ఇటీవల కురిసిన భారివర్షాలకు నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం అందజేయాలని బిజెపి రాష్ట్ర నాయకులు రావుల రాంనాథ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం లక్మణచందా మండలం లోని తిరుపల్లి ,  మునిపెల్లి, చింతల చందా ,చామన్పెల్లి తదితర గ్రామాల్లో ఇటీవల కురిసిన  భారీ వర్షాలకు నష్టపోయిన పంటలు, రోడ్లు టాన్స్ ఫారంలు  ,వైకుంఠధామాలు ,మరియు ఇళ్లలో తడిచిపోయిన ధాన్యం  ఇతర వస్తువులను పరిశీలించి పేదలను ,రైతులను కలిసి ఓదార్చారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చుట్టపు చూపులా వచ్చి వెళ్లారని గ్రామాల్లో పర్యటించి అధికారుల తో మాట్లాడి వెళ్లారని రైతుల పొలాల్లో కి వెళ్లలేదని ఎద్దేవాచేశారు.. నష్టపరిహారం కేంద్ర ప్రభుత్వం అందజేలనడం సిగ్గుచేటన్నారు, మీతో చేతగాకపోతే డిగిపోవాలన్నారు.  ఆయన వెంట బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు కమల్ నయన్   బీజేపీ మండల ప్రధాన కార్యదర్శులు గాండ్ల విట్టల్ అలూరి రాజు  నాయకులు గంగాధర్ ,వెంకట్రెడ్డి ,నర్సారెడ్డి ,దేవేందర్ ,కృష్ణారెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Attachments area