భారివర్షాలకు సంభవించిన నష్టం వివారాలను శాఖలవారిగా అందజేయాలి

సమీక్ష సమావేశంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
  బ్యూరో, జులై12,జనంసాక్షి,,,    గత  ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు  జిల్లా లో సంభవించిన నష్టం  వివరాలను  తెలుసుకునేందుకు మంగళవారం జిల్లా అధికారులు,  ప్రజాప్రతినిధులతో  అత్యవసర  సమావేశాన్ని   జిల్లా పాలనాధికారి  సమావేశ   మందిరంలో  అటవీ, పర్యావరణ,  న్యాయ, దేవాదాయ  శాఖ  మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి     జడ్పి  ఛైర్పర్శన్  విజయలక్ష్మి రాంకిషన్,  జిల్లాపాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ, sp ప్రవీణ్ కుమార్,  ఎమ్మెల్యే విఠల్ రెడ్డి,  అదనపు కలెక్టర్ లు  హేమంత్ బోర్కడే,  రాంబాబు,  మున్సిపల్ చైర్మన్  ఈశ్వర్, తదితరులతో  సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ  భారీ వర్షాల  కారణంగా 563    మిల్లిమిటర్ల    వర్షం ఈ సంవత్సరం  అధికాంగా ఉండడం వలన  పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిందని  తెలిపారు.
ఇరిగేషన్,  విద్యుత్,  అర్ అండ్ బి,  పంచాయతీ రాజ్,  తదితర అధికారులు  అప్రమత్తంగా ఉండాలని  అన్నారు.
శాఖల వారిగా జరిగిన  నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు.  నష్టం  వివరాలను   ప్రభుత్వానికి  పంపించడం జరుగుతుందని  పేర్కొన్నారు. పోలీస్ శాఖ తరుపున  అన్ని సహాయ, సహకారాలు  అందించడం  జరుగుతుందని తెలిపారు.
జిల్లా పాలనాధికారి  మాట్లాడుతూ  అన్ని శాఖల  అధికారులు రేపటి వరకు  అప్రమత్తంగా ఉండాలని, మండలం, డివిజన్ ల అధికారులు అందరు హెడ్ క్వార్టర్ మైంటైన్ చేయాలని అన్నారు.
పంచాయతీ సెక్రెటరీ గ్రామం లోనే ఉండి ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని తెలిపారు.
తహసీల్దార్ లు  చిన్న చిన్న రెపర్స్ ఏమైన ఉంటే  వెంటనే చేయించాలని, పంచాయతీ,  అర్ అండ్ బి  ఎస్టిమేట్ వేసుకొని ఏమరజెన్సీ పనులు  చేపట్టాలని,  ఎవరుకూడా   సెలవులో  వెళ్ళకూడదని  ఆదేశించారు.