భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
ముంబయి,జూలై22(జనంసాక్షి): దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 323 పాయింట్లు నష్టపోయి 38,013 వద్ద, నిఫ్టీ 72 పాయింట్లు నష్టపోయి 11,346 వద్ద ట్రేడింగ్‌ను ముగించాయి. నిఫ్టీ రియల్టీ, నిఫ్టీ ఆర్థిక సేవల సూచీలు 0.2శాతం నష్టపోయాయి. నిఫ్టీ ఫార్మా, లోహరంగ సూచీలు 1శాతం లాభపడ్డాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వీస్, హిందూస్థాన్ యూనీలీవర్, కొటాక్ మహీంద్రా బ్యాంక్‌లు అత్యధికంగా నష్టపోయాయి. జాజ్ ఫినాన్స్ సర్వీసు షేర్లు రెండునెలల అత్యల్పానికి చేరాయి. మరోపక్క హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్ కంపెనీల షేర్లు కూడా దాదాపు 6శాతం నష్టపోయాయి. ఈ కౌంటర్లలో మదుపరులు లాభాల స్వీకరణకు పాల్పడటంతో ఈ షేర్లు కుంగాయి.