భారీ వరద పై అధికారులు అప్రమత్తంగా ఉండాలి:
జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ
జనంసాక్షి, మంథని: పెద్దపల్లి జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ప్రాజెక్టుల వద్దకు వస్తున్న భారీ వరద పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. మంథని మండలంలోని సిరిపురం గ్రామం వద్ద ఉన్న పార్వతి బ్యారేజీని కలెక్టర్ బుధవారం సందర్శించారు. నీటిపారుదల శాఖ అధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉండి, ఉన్నతాధికారులతో సమన్వయం చేసుకొని ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. బ్యారేజి నుంచి భారీ స్థాయిలో నీటి విడుదల వల్ల సమస్య సేల్ ఉత్పన్నమయ్యే ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. అనంతరం బెస్తపల్లి లో గ్రామ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియను కలెక్టర్ పర్యవేక్షించారు. జిల్లాలో మరో 3 రోజులపాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. ప్రజలు అత్యవసర పరిస్థితులు మాత్రమే బయటకు రావాలని కలెక్టర్ తెలిపారు. జెడ్పీటీసీ తరగం సుమలత,ఎంపీపీ కొండ శంకర్,మంథని తహసిల్దార్ బండి ప్రకాష్ తదితరులు ఉన్నారు