*భారీ వర్షాలు వరదల వల్ల నష్టపోయిన వారిని త్వరితగతిన ఆదుకోవాలి*
మెట్పల్లి టౌన్ :జనంసాక్షి
రాష్ట్రంలో భారీ వర్షాలు వరదల కారణంగా అనేక జిల్లాల్లో పంటలు తుడిచిపెట్టుకుపోయాయని అదేవిధంగా జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో మొలక దశలో ఉన్న అనేక పంటలు కొట్టుకుపోయాయన్నారు నేడు మెట్పల్లి పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు వార్డ్ కౌన్సిలర్స్ యామరాజయ్య మాట్లాడుతూ నియోజకవర్గంలోని నాలుగు మండలాలలో సాగు దశలో ఉన్న వరితోపాటు మొలక దశలో ఉన్న నారు మొత్తం నాశనం అయిందని అన్నారు అలాగే మొక్కజొన్న ఇప్పటికే రెండోసారి నాటిన రైతులు అధిక వర్షాలతో మూడోసారి విత్తాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు బాధిత రైతులను మొక్కుబడిగా పరామర్శించడం తప్ప వారికి ఒరిగిందేమీ లేదని విమర్శించారు ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు తక్షణమే స్పందించి నియోజకవర్గంలోని నాలుగు మండలాలలో పంట నష్టం పై పూర్తిస్థాయిలో అంచనాలు రూపొందించి నష్టపోయిన రైతులను త్వరితగతిన ఆదుకోవాలని కోరారు అలాగే నియోజకవర్గంలోని పలు గ్రామాలలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో ఇండ్లు కూలిపోయి ఎంతోమంది నిరస్రాయులయ్యారని ప్రభుత్వం వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించి ఆదుకోవాలని కోరారు ఈ సమావేశంలో నాయకులు