భారీ వర్షాల దృష్ట్యా పోలీస్ యంత్రాంగం అప్ర‌మ‌త్తం

జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల దృష్ట్యా  ప్రజలంతా చాలా అప్రమత్తంగా ఉండాలి*
నిర్మల్ జిల్లా ఎస్పీ .సిహెచ్.ప్రవీణ్ కుమార్
  బ్యూరో, జూలై 09,,జనంసాక్షి,,,   నిర్మల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నoదున  గ్రామాలలో పాత ఇండ్లు, గుడిశ లలో, శిథిలావస్థలో  ఉండే నివాసలలో ఉండే  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అలాగే నది తీరా మరియు ప్రాజెక్ట్ పరివాహక ప్రాంతం గ్రామాలలో పెద్దలు తమ పిల్లలను నదులలోకి,వాగుల వద్దకి వెళ్లకుండా చూడాలని, వాగులు వంకలలో కూడా నీటి ప్రవాహాలు వచ్చే అవకాశం ఉన్నందున ఆయా ప్రాంతాలలో అప్రమతంగా ఉండాలని జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్ అన్నారు..
నిర్మల్ జిల్లాలో  భారీ వర్షాల దృష్ట్యా  పోలీస్ యంత్రాంగం అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని జిల్లా ఎస్పీ .    పోలీస్ అధికారులకు ఆదేశించారు.వాగులు వంకలన్నీ ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో స్ధానిక పోలీసులు తమ పోలీస్ స్టేషన్  పరిధిలోని రోడ్లు, గ్రామాలు జలమయమయ్యే ప్రాంతాలలో ప్రజలకు అందుబాటులో వుంటూ.. ఎటువంటి ఆటంకాలు కలగకుండా తక్షణమే పర్యవేక్షించి ముందస్తు చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు సూచించారు.
అధికారులు 24 గంటలు అందుబాటులో ఉండి సేవలు అందించాలని కోరారు..జిల్లాలో ఎక్కడైనా వరద ఉధృతో రోడ్లు తెగిపోయిన, ఉదృతంగా ప్రవహించేనా అక్కడికి ఆ గ్రామ ప్రజలు వెళ్లవద్దని, రెండు దిక్కులా బారికేడ్లు, ప్లాస్టిక్ కోన్స్, త్రెడ్ మరే ఇతర పరికరాలు ఏర్పాటు చేసి ప్రమాదాల భారీన పడకుండా ట్రాఫిక్ డైవర్షన్ చేయాలని జిల్లా ఎస్పీ  కోరారు…
*ఏమైనా సంఘటనలు జరిగితే  డయల్ 100 సమాచారం అందించినచొ తక్షణ సహాయక రక్షణ చర్యలు చేపడుతం అని అన్నారు..*
ఎడతెరపి లేకుండా కురుస్తున్న  వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే ఆవకాశం ఉంటుదని కాబట్టి  రోడ్డు రవాణా,విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడకుండా విధ్యుత్, రెవెన్యూ, ఆర్ & బీ శాఖ అధికారుల సమన్వయంతో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీస్ అధికారులకు ఆదేశించారు.రెండు రోజులు పరిస్థితి ఇలాగే ఉంటుందని, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో ప్రజల అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దని కోరారు.