భార్యను కాల్చి భర్త ఆత్మహత్య
అమెరికాలో తెలుగు ఎన్‌ఆర్‌ఐ దారుణ
అనాదలయిన ఇద్దరు పిల్లలు
టెక్సాస్,ఫిబ్రవరి19(జనంసాక్షి): అగ్రరాజ్యం అమెరికాలోని టెక్సాస్‌లో ఓ తెలుగు యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను తుపాకీతో కాల్చి చంపి, ఆపై తాను కూడా అదే తుపాకీతో పాయింట్ బ్లాంక్‌లో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతులను శ్రీనివాస్ నెకరకంటి, శాంతిగా గుర్తించారు. కాగా, శ్రీనివాస్ ఓ ఇంధన కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్లు సమాచారం. ఈ దంపతులకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. వీరి మృతితో పిల్లలు కన్నీరుమున్నీరయ్యారు. అనాధలుగా మిగిలారు. సోమవారం ఈ దంపతులు నివాసముంటున్న ఇంటి నుంచి తుపాకీ శబ్దాలు వినిపించడంతో స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలికి వచ్చారు. అప్పటికే శాంతి, శ్రీనివాస్ లు విగత జీవులుగా కనిపించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.