భూగర్భ డ్రైనేజీ సమస్యపై జలమండలి అధికారులతో పర్యటించి న ఎమ్మెల్యే

నాచారం(జనంసాక్షి):  నాచారం ఓల్డ్ విలేజ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయాన్ని  ఉప్పల్ శాసనసభ్యులు బేతి సుభాష్ రెడ్డి,  నాచారం డివిజన్ కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్ తో కలిసి ప్రారంభించారు. అనంతరం నాచారం ఓల్డ్ విలేజ్లో నెలకొన్న భూగర్భ డ్రైనేజీ సమస్యపై జలమండలి , ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పర్యటించారు. చాలా సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన మురుగునీటి కాలువలు పూర్తిగా నిండిపోవడంతో డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయని తొందరలోనే సంబంధించిన ఎస్టిమేట్లు తనకు ఇవ్వాలని ఎమ్మెల్యే సూచించారు. వర్షాకాలం అయిపోగానే డ్రైనేజీ పనులు ప్రారంభమయ్యేలా చూస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు .దాంతోపాటు మంచినీటి పైప్లైన్లు కూడా కొత్తవి ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే తెలియజేశారు. కార్యక్రమంలో జలమండలి జనరల్ మేనేజర్ జాన్ షరీఫ్,  డీజీఎం సతీష్,  డిప్యూటీ ఇంజనీర్ రూప,  వర్క్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్,  ఇన్చార్జి ప్రాజెక్ట్ ఆఫీసర్ రమాదేవి. నాచారం డివిజన్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సీనియర్ సిటిజన్లు పాల్గొన్నారు.