భూపాలపల్లిలో రోడ్డు ప్రమాదం
భూపాలపల్లి: వరంగల్ జిల్లా భూపాలపల్లి మండలకేంద్రంలోని సుభాష్‌నగర్ కాలనీలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తిని ఇసుక లారీ ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు భూపాలపల్లి పట్టణంలోని జవహర్‌నగర్ కాలనీకి చెందిన పర్లపాక సతీష్(32)గా గుర్తించారు. సతీష్ ఓ బ్రాందీ షాపులో పనిచేస్తుంటాడు. విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సతీష్ శరీరం నుజ్జునుజ్జైపోయింది. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.