భూమి ని కేటాయించిన నిర్మాణానికి. నోచుకోని గురుకుల పాఠశాల భవనం.


తిరుమలాయపాలెం. జూలై 24(జనంసాక్షీ) (ఖమ్మం జిల్లా) తిరుమలాయపాలెం మండలం లోగురుకుల బాలుర పాఠశాల నిర్మాణం కోసం ప్రభుత్వం గతంలో7యకారాల భూమి ని కేటాయించిది .నేటి వరకు నిర్మాణం పనులు ఇప్పటి వరకు ప్రారంభించడానికి నోచుకోలేదు. ఖమ్మం నగరంలో నీ పుట్టకోట గ్రామంలో బొమ్మ ఇంజనీరింగ్ కాలేజిలో అద్దె భవనం లో నిర్వహింస్తున్నారు .సరైన వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పేరెంట్స్ కమిటీ ఆద్వర్యంలో తిరుమలాయపాలెం మండల ఎం పీ డీఓ గ్రీవిన్స్ డేలో వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా పేరెంట్స్ కమిటీ అద్యక్షుడు పి శ్రీ నివాస్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి గురుకుల పాఠశాల భవననిర్మణం చేపట్టి పిల్లల కు సరైన న్యాయం చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో పేరెంట్స్ కమిటీ సభ్యులు ఎన్.భారతీ .దావళ్ల కాంతరావు. మేడి రమేష్. నాగేందర్. కే కృష్ణ రావు. అనిత తదితరులు పాల్గొన్నారు..