మండలి కోడ్ కూసింది
` స్థానిక కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు
` ఎపిలో 11, తెలంగాణలో 12 స్థానాలకు ఎన్నిక
` షెడ్యూల్ వవిడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం
` 16న విడుదల కానున్న ఎన్నికల నోటిఫికేషన్
` డిసెంబర్ 10న పోలింగ్…14న ఓట్ల లెక్కింపు
న్యూఢల్లీి,నవంబరు 9(జనంసాక్షి): తెలంగాణ,ఆంధ్రా రాష్టాల్ల్రో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను విడుదల చేసింది. తెలంగాణలో 12, ఎపిలో 11 స్థానాలకు ఎన్నికలను నిర్వహించనున్నారు. ఈనెల 16 న నోటిఫికేషన్ విడుదల కానుంది. 23 వరకు నామినేషన్ల స్వీకరణ, 24న నామినేషన్ల పరిశీలన, 26 న ఉపసంహరణకు అధికారులు గడువు ఇచ్చారు. డిసెంబర్ 10న పోలింగ్ నిర్వహించి 14 న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. తెలంగాణలో 12 స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూలు విడుదలైంది. రాష్ట్రంలోని ఆదిలాబాద్, వరంగల్, నల్లగొండ, మెదక్ , నిజామాబాద్, ఖమ్మం జిల్లాల నుంచి ఒక్కో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అవనుంది. అలాగే కరీంనగర్ , మహబూబ్‌నగర్, రంగారెడ్డి నుంచి రెండేసి ఎమ్మెల్సీ స్థానాలు త్వరలో ఖాళీ కానున్నాయి. వీటన్నింటికీ కలిపి నవంబర్ 16న నోటిఫికేషన్ విడుదలవనుంది. అలాగే ఈ ఎన్నికల కోసం నామినేషన్లను నవంబర్ 23 వరకూ స్వీకరిస్తారు. నవంబర్ 24న నామినేషన్ల పరిశీలన ఉంటుంది.ఎపలో కూడా మంగళవారం 11 ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదలైంది. అనంతపురం`1, కృష్ణా`2, తూర్పుగోదావరి`1, గుంటూరు`2, విజయనగరం`1, విశాఖపట్నం`2, ప్రకాశం`1 స్థానాలకు షెడ్యూల్ ప్రకటించారు. నవంబర్ 16న నోటిఫికేషన్, డిసెంబర్ 10న పోలింగ్, 14న కౌంటింగ్ జరగనుంది. ఈ స్థానాలన్నింటికీ డిసెంబర్ 10న పోలింగ్ నిర్వహిస్తారు. డిసెంబర్ 14న ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఎన్నికల సంఘం పేర్కొంది. దాఖలైన నామినేషన్లను ఈనెల 17న పరిశీలించనున్నారు. ఈనెల 22 మధ్యాహ్నం 3 గంటలవ రకు నామినేషన్ల ఉపసంహరణకు గుడువు విధించారు. మరోవైపు ఏపీలో 11 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. వచ్చే ఏడాది జనవరి 4వ తేదీన పలువురు సభ్యుల పదవీకాలం ముగియనుంది.
స్థానిక ఎన్నికల షెడ్యూల్‌తో కోడ్ అమలు:సీఈవో శశాంక్ గోయల్ వెల్లడి
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో హైదరాబాద్ జిల్లా మినహా అన్ని జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని సీఈవో శశాంక్ గోయల్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ఆదిలాబాద్, వరంగల్, నల్లగొండ, మెదక్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల నుంచి ఒక్కో ఎమ్మెల్సీ స్థానానికి, అలాగే కరీంనగర్ , మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల నుంచి రెండేసి ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నవంబర్ 16వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. నవంబర్ 23వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 24న నామినేషన్లను పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ నవంబర్ 26. డిసెంబర్ 10న పోలింగ్ నిర్వహించి, 14న ఓట్లను లెక్కించనున్నారు. 10వ తేదీన ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరగనుంది. బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికల నిర్వహణ ఉంటుందని సీఈవో శశాంక్ గోయల్ స్పష్టం చేశారు.