మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
* తాసిల్దార్ సుభాషిణి,
జూలై 11(జనం సాక్షి )
మండలంలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మండల తాసిల్దార్ సుభాషిని అన్నారు. మండలంలోని ప్రజలు ఎవరూ వాగులు చెరువులు కాలువలు వద్దకు వెళ్లవద్దని విద్యుత్ స్తంభాల వద్ద కూడా వెళ్లకూడదని అలాగే కూలిపోయే దశలో ఉన్న ఇళ్లల్లో ఉండకూడదు అన్నారు
అలాగే చెట్లు కింద ఉండకూడదని మండల ప్రజలకు సూచించారు. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అన్నారు. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని మండల ప్రజలకు తాసిల్దార్ సుభాషిని సూచించారు