మందకృష్ణ మాదిగ చేసిన పోరాట ఫలితంమే ఆరోగ్యశ్రీ

. నేరడిగొండఆగస్టు7(జనంసాక్షి): మాదిగ దండోరా ఉద్యమం సమస్త మానవ హక్కుల దండోరాగా మారిందని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర  నాయకుడు గజ్జెల శంకర్ అన్నారు.ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆరోగ్యశ్రీ వారోత్సవాలను ఆదివారం రోజున నెరడిగొండ మండలంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు గజ్జల శంకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుండె జబ్బులతో బాధపడుతున్న వేలాది మంది చిన్నారులకు ప్రభుత్వమే ఉచిత ఆపరేషన్లు చేయించాలని మందకృష్ణ మాదిగ నాయకత్వంలో నడిపిన పోరాట ఫలితంగా దిగివచ్చిన నాటి వైస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్లో గుండె జబ్బులతో బాధపడుతున్న పెద వాళ్లకు కూడా ఆపరేషన్లు కొనసాగించారు.ఆరోగ్య బీమాగా మొదలైన పథకం అది ఆరోగ్యశ్రీ గా రూపాంతరం చెంది ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాలలో తెల్లరేషన్ కార్డు కలిగిన ప్రతి పేద కుటుంబానికి ఆరోగ్యశ్రీకార్డు ద్వారా కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి రావడానికి మందకృష్ణ మాదిగ చేసిన పోరాట ఫలితంగానే ఏర్పడీ సమాజంలో వివక్షతకు గురవుతున్న వికలాంగులను వృద్ధులను ఒంటరి మహిళలను చేరదీసి వారి పింఛన్ల డిమాండ్ల సాధన కోసం పెద్ద ఎత్తున పాలక ప్రభుత్వాల మీద పోరాటం చేసి ఘన విజయం సాధించి సమాజంలో అన్ని వర్గాల ప్రజల కోసం పోరాడిన ఘనత ఎమ్మార్పీఎస్ ఉద్యమానికి దక్కిందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్,ఎంఎస్పీ
రాష్ట్ర నాయకులు
గజ్జల శంకర్ మాదిగ
గజ్జల అశోక్ మాదిగ జిల్లా నాయకులు సారంగా రవి లక్ష్మణ్ గజ్జల రవి గజ్జల నగేష్
తదితరులు పాల్గొన్నారు.