మక్కామసీదు కేసులో ఎస్‌ఐఏకు ఊరట

హైదరాబాద్‌,జనంసాక్షి: మక్కామసీదు బాంబు పేలుళ్లలో కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎస్‌ఐఏ) కు న్యాయస్థానంలో ఊరట లభించింది. ఈ కేసులో నిందితులైన లోకేంద్రశర్మ, దేవేంద్రగుప్తాలకు గతంలో నాంపల్లి కోర్టు మంజూరు చేసిన బెయిల్‌ ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది.
గతంలో ఇచ్చిన తీర్పును మరోసారి పున సమీక్షించుకోవాలని నాంపల్లి కోర్టును ఈ సందర్భంగా హైకోర్టు ఆదేశించింది. మ్క మసీదు బాంబు పేలుళ్ల నిందితులకు నాంపల్లి కోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో ఎన్‌ఐఏ అథికారులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.