-->

*మట్టివిగ్రహాలను మాత్రమే వాడాలి*

– రేపటి నుండి గణేష్ ఉత్సవాలు ప్రారంభం
– మునగాల ఎస్సై ఎన్ బాలు నాయక్

మునగాల, ఆగష్టు 27(జనంసాక్షి): రేపటినుండి మండలంలో నిర్వహిస్తున్న గణేష్ నవరాత్రులలో మట్టి విగ్రహాలను మాత్రమే వాడుతూ శాంతిభద్రతల నడుమ గణేష్ ఉత్సవాలను నిర్వహించుకోవాలని మునగాల ఎస్సై ఎన్ బాలు నాయక్ సోమవారం జనంసాక్షితో ఆయన అన్నారు. అంతేకాకుండా పర్యావరణ కాలుష్యము లేకుండా, అశ్లీలతకు తావులేకుండా నిర్వహించుకోవాలని, విద్యుత్ పర్మిషన్ కు 5వందల రూపాయల నుండి వెయ్యి రూపాయల వరకు మండప సామర్థ్యం చొప్పున డిడిని తీయాలని, మైక్ పర్మిషన్ తీసుకోవాలని, ఏర్పాటు చేసుకున్న నిర్వాహకులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, మండపాలు నిర్వహించే చుట్టుపక్కలా విద్యుత్ ఏర్పాటు చేయాలని, పూజా కార్యక్రమాలను తగిన సమయంలోనే నిర్వహించుకోవాలని, తప్పకుండా విద్యుత్ పర్మిషన్ తీసుకోవాలని, విగ్రహం ఏర్పాటు చేసే స్థలంలో ఇంటి యజమాని పర్మిషన్ కూడా ఉండాలని సూచించారు. అంతేకాకుండా గణేష్ ఉత్సవాల కోసం చందాలను వసూలు చేసే విషయంలో బలవంతం చేయరాదని, విగ్రహాలను రోడ్లపై ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదని, మతాచారాలకతీతంగా ఏర్పాటు చేసుకోవాలని, మద్యపానం పేకాటలకు సంబంధించిన విషయాలలో పూర్తిగా కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. గ్రామాలలో ఉన్న పాఠశాలలు, ఆశ్రమాలు, చర్చిలు, మసీదులకు ఆటంకం కలుగకుండా ఉత్సవాలు నిర్వహించుకోవాలని సూచించారు