మణుగురు రైలులో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ అదృశ్యం
వరంగల్, సెప్టెంబరు 9 : సికింద్రాబాద్-మణుగూరు రైలులో తమిళనాడుకు చెందిన సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ గణపతి అదృశ్యమయ్యాడు. కాజీపేటలో గణపతి తప్పిపోయినట్లు తోటి కానిస్టేబుళ్లు గుర్తించారు. ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో పనిచేస్తున్న గణపతి అదృశ్యంపై డోర్నకల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.