మణుగూరు మండల ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి
నీటి ప్రవాహాలకు దూరంగా ఉండాలి లోత ట్టూ ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళండి. చినుకు పడింది కదా సరదాకు వెళ్తే ప్రమాదాలు పొంచి ఉంటాయని గుర్తేరగండి. యువత చెరువులు గోదావరి నది ప్రాంతాలకు చేపలు పట్టడానికి వెళ్లకుండా జాగ్రత్తలు వహించండి.మండల ప్రజలు ఈరోజు దూర ప్రయాణాలు చేయకుండా ఉంటే మంచిది నిరంతరాయంగా కురుస్తున్న వర్షాల కారణంగా నదులు కాలువలు పొంగి రహదారులపై నీరు నిలిచి ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉన్నందున వాయిదా వేసుకోవటం ఉత్తమం.. ఉధృతంగా ప్రవహిస్తున్న నీటి ప్రవహాలను కాలువలు దాటే ప్రయత్నం చేయకూడదు.. చిన్నపిల్లలు తడిసిన కరెంటు స్తంభాలను ముట్టుకోకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి. రైతులు పొలాలకు వెళ్లేటప్పుడు కరెంట్ స్తంభాలు కరెంటు తీగలు తెగిపడే అవకాశం ఉన్నందున గమనించి వెళ్లాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో ఏమైనా సమస్యలు ఉంటే 10 0 డయల్ చేసి తెలుపగలరు. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించాలన్నారు. అత్యవసర సమయంలో ప్రజలకు అందుబాటులో మీ ముత్యం రమేష్ సర్కిల్ ఇన్స్పెక్టర్ 94407 95327, రాజ్ కుమార్ సబ్ ఇన్స్పెక్టర్ 97012 73139, పురుషోత్తం సబ్ ఇన్స్పెక్టర్ 94938 71670 సంప్రదించగలరు. సదా మీ సేవలో